Andhra Pradesh: ఏపీలో భిన్న వాతావరణం.. మూడు రోజులపాటు వర్షాలు.. అదే సమయంలో ఠారెత్తించనున్న ఎండలు!

Mixed weather in Andhra Pradesh

  • వర్షాలకు తోడు ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల
  • 60 మండలాల్లో నేడు వడగాల్పులు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
  • ఈ నెల 14న తీరం దాటనున్న ‘మోఖా’ తుపాను

ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అనంతపురం జిల్లా శెట్టూరులో నిన్న అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, నేడు రాష్ట్రంలోని 60 మండలాల్లో వడగాలులు వీచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

మోఖా తుపాను ఈ నెల 14న ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ మధ్యలో కాక్స్ బజార్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తర ఈశాన్య దిశగా కదిలిన ‘మోఖా’ గత రాత్రి తీవ్ర తుపానుగా మారింది. నేడు మధ్య బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Andhra Pradesh
Temperature
Rains
Cyclone Mocha
  • Loading...

More Telugu News