ajit: బైక్‌పై ప్రపంచయాత్రకు తమిళ హీరో అజిత్!

Actor Ajit World tour soon

  • సినిమా విరామాల్లో అజిత్ బైక్ టూర్స్
  • ఇటీవలే నేపాల్, భూటాన్ దేశాల్లో పర్యటన
  • నవంబర్ లో వరల్డ్ టూర్ కోసం వేగంగా తమిళ సినిమా షూటింగ్

రేసింగ్ అంటే ఎంతో ఇష్టపడే ప్రముఖ సినీ నటుడు అజిత్ సినిమా విరామ సమయాల్లో టూర్స్ వేస్తుంటారు. ఇటీవల ఉత్తరాది రాష్ట్రాలతో పాటు నేపాల్, భూటాన్ లకు బైక్ పై వెళ్లారు. ఈ నటుడు మరోసారి బైక్ పై సాహస యాత్రకు సిద్ధమవుతున్నారట. అజిత్ ప్రపంచ యాత్ర చేయనున్నట్లు ఆయన మేనేజర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.

అజిత్ ఇప్పటికే బైక్‌పై ఎన్నో సాహస యాత్రలు చేశారని, సవాళ్లతో కూడిన భూభాగంలో ప్రయాణించారని, తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నారని, ఇటీవల పలు ప్రాంతాల్లో పర్యటించారని పేర్కొన్నారు. త్వరలో ఆయన మరో యాత్రకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నుండి అజిత్ తన బైక్ ‌పై ప్రపంచ యాత్రకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ సాహస యాత్ర కోసం అజిత్ ఓ తమిళ సినిమా షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేశారు.

ajit
actor
  • Loading...

More Telugu News