Indraja: ఆ ఒక్క సినిమా చూస్తున్నప్పుడల్లా బాధపడుతూనే ఉంటాను: సీనియర్ హీరోయిన్ ఇంద్రజ

Indraja Interview

  • అందాల నాయికగా వెలిగిన ఇంద్రజ 
  • స్పెషల్ సాంగ్స్ చేయనని చెప్పానని వెల్లడి
  • విశ్వనాథ్ గారి సినిమాలంటే ఇష్టమని వ్యాఖ్య   
  • తనకి ఇష్టమైన సినిమా 'స్వర్ణకమలం' అంటూ వివరణ  

నిన్నటితరం అందమైన హీరోయిన్స్ లో ఇంద్రజ ఒకరు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇంద్రజ ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ఒకానొక దశలో నేను స్పెషల్ సాంగ్స్ కూడా చేశాను. ఇక అందరూ సాంగ్స్ గురించే అడుగుతూ ఉండటంతో, చేయనని తేల్చి చెప్పాను" అన్నారు. 
 
నా వరకూ వచ్చి వెళ్లిన సినిమాలు ఉన్నాయి. 'పెళ్లి సందడి' సినిమా కోసం రాఘవేంద్రరావుగారు నన్ను .. ఊహను అనుకుంటున్నట్టుగా నాకు తెలిసింది. అది ఎంతవరకూ నిజమనేది మాత్రం తెలియదు. ఎందుకంటే ఆ సినిమా నుంచి ఎవరూ కూడా నన్ను సంప్రదించలేదు" అని అన్నారు. 

"నేను ఏ సినిమా చూసినా అరే ఇలాంటి పాత్ర నాకు వస్తే బాగుండునని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒక్క 'స్వర్ణకమలం' సినిమాను ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు బాధపడుతూనే ఉంటాను. అలాంటి సినిమా .. అలాంటి పాత్ర చేయాలని అనిపిస్తూ ఉంటుంది. నేను వేషం ఇవ్వమని ఎవరినీ అడగలేదు. విశ్వనాథ్ గారితో చేయాలని ఉన్నప్పటికీ, ఆయనను కూడా అడగలేకపోయాను" అని చెప్పుకొచ్చారు.

Indraja
Accress
Tollywood
  • Loading...

More Telugu News