Indraja: నాకు పొగరని అంతా అనుకునేవారు: సీనియర్ హీరోయిన్ ఇంద్రజ

Indraja Interview

  • 1990లలో ఎంట్రీ ఇచ్చిన ఇంద్రజ 
  • టీనేజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చానని వెల్లడి
  • ఆ వయసులో తనకేమీ తెలిసేది కాదన్న ఇంద్రజ  
  • అవకాశాల కోసం ఎప్పుడూ తిరగలేదని వివరణ


1990లలో ఇండస్ట్రీకి వచ్చిన కథానాయికలలో ఇంద్రజ ఒకరు. సౌందర్య .. రంభ .. ఆమని దూసుకుపోతున్న సమయంలో ఇంద్రజ ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. తెలుగులో 'జంతర్ మంతర్' నా ఫస్టు సినిమా. అప్పటికి నా వయసు 15 ఏళ్లు మాత్రమే. నేను అవకాశాల కోసం ఎక్కడికీ తిరిగింది లేదు. అవకాశం నేరుగా వచ్చి నా తలుపు తట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఆ వయసులోనే నేను సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించడం విశేషం" అన్నారు. 

"చిన్నతనం కావడం వలన ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలిసేది కాదు. అందువలన సెట్లో  ఒక పక్కన కూర్చుని నా పని నేను చూసుకునేదానిని. ఎవరైనా పలకరిస్తే తప్ప మాట్లాడేదానిని కాదు. దాంతో ఈ అమ్మాయికి చాలా పొగరు అనుకునేవారు. నాకు కెమెరా ముందు నటించడం కంటే కూడా, ఇలా అనుకునేవారి వలన భయం ఎక్కువగా ఉండేది" అని చెప్పుకొచ్చారు. 

Indraja
Actress
Tollywood
  • Loading...

More Telugu News