Tollywood: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు పృథ్వీరాజ్

Actor Prithviraj hospitalised

  • 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ
  • కూతురు హీరోయిన్ గా 'కొత్త రంగుల ప్రపంచం' సినిమాకు దర్శకత్వం
  • సినిమా ప్రమోషన్స్ లో అస్వస్థతకు గురైన పృథ్వీ

టాలీవుడ్ ప్రముఖ నటుడు, 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీగా గుర్తింపు పొందిన కమెడియన్‌ పృథ్వీరాజ్‌ ఆసుపత్రి పాలయ్యారు. తాను తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా కొత్త రంగుల ప్రపంచం ప్రమోషన్స్ లో అస్వస్థతకు గురై కుప్పకూలిన ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు. ఈ విషయం చెబుతూ ఆయన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. అందులో బెడ్ పై పడుకున్న పృథ్వీ తన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. హాస్య నటుడిగా వందల చిత్రాల్లో నటించిన పృథ్వీ తన కూతురు శ్రీలును హీరోయిన్ గా పరిచయం చేస్తూ కొత్త రంగుల ప్రపంచం సినిమాను తెరకెక్కించారు. 

విడుదలకు సిద్ధంగా వున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన సమీప ఆసుత్రికి తరలించారు. తాను కోలుకుంటున్నానని పృథ్వీ చెప్పారు. దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశానని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నానని తెలిపారు. కొత్త రంగుల ప్రపంచం సినిమాకి అందరి ఆశీస్సులు కావాలని కోరారు.

Tollywood
actor
pritviraj
30 years Prithvi
  • Loading...

More Telugu News