rain: హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం

Heavy rains in Hyderabad

  • సరూర్ నగర్, చంపాపేట, సైదాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం
  • రోడ్లపై నిలిచిన నీరు... ట్రాఫిక్ జామ్
  • మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్న పాదచారులు, వాహనదారులు

హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భాగ్యనగరంలోని సరూర్ నగర్, చంపాపేట్, సైదాబాద్, సంతోష్ నగర్, మలక్ పేట, చాదర్ ఘాట్, ఐఎస్ సదన్, కోఠి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్ల పైన నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు, పాదచారులు మెట్రో పిల్లర్ల కింద, పెద్ద పెద్ద భవంతుల కింద తలదాచుకున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.

rain
Hyderabad
  • Loading...

More Telugu News