Revanth Reddy: అవార్డులు తెచ్చినోళ్లను వేధించడం సరికాదు: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి

Revanth Reddy letter to KCR

  • జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్‌పై సీఎంకు టీపీసీసీ చీఫ్ లేఖ
  • వారిని బానిసలుగా చూడటం తప్ప హక్కులు పరిరక్షించడం లేదని ఆరోపణ
  • వారి కష్టంతోనే గ్రామ పంచాయతీలకు 79 అవార్డులు వచ్చాయని వ్యాఖ్య 

జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ ప్రభుత్వంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల పరిస్థితి బానిసల కంటే దారుణంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో గొడ్డు చాకిరీ చేయించుకోవడం తప్ప వారి హక్కులను పరిరక్షించడంలో శ్రద్ధ చూపడం లేదని అన్నారు. రెగ్యులర్ చేయాలని పన్నెండు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఎప్పుడూ రాజకీయాలు తప్ప వారి ఆవేదన పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారి కష్టంతోనే గ్రామ పంచాయతీలకు 79 అవార్డులు వచ్చాయన్నారు.

అవార్డులను తెచ్చిన వారిని వేధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీల కష్టానికి మీరు ఇచ్చే రివార్డ్ ఇదా? అని నిలదీశారు. గత ఏడాది వారి ప్రొబేషన్ ను పెంచిన సమయంలో అసెంబ్లీలో సీఎం హోదాలో రెగ్యులరైజ్  పైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మీరు ఇచ్చిన హామీ ఏప్రిల్ 11వ తేదీతో ముగిసిందని, అయినప్పటికీ రెగ్యులరైజ్ పైన ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News