Prabhas: అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటున్న 'ఆది పురుష్' ట్రైలర్!

Adi Purush trailer released

  • 'ఆది పురుష్' నుంచి వచ్చిన ట్రైలర్
  • విజువల్స్ పరంగా ఆకట్టుకుంటున్న కంటెంట్ 
  • ప్రధానమైన ఘట్టాలపై కట్ చేసిన ట్రైలర్ 
  • జూన్ 16వ తేదీన సినిమా విడుదల  

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు 'ఆది పురుష్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. భారీ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ .. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. జూన్ 16వ తేదీన ఈ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సముద్రుడిపై శ్రీరాముడు విల్లు ఎక్కుపెట్టడం .. రావణుడు మారు వేషంలో పర్ణశాల దగ్గరకి రావడం .. సీతాదేవి లక్ష్మణ రేఖ దాటడం .. శబరి ఎంగిలి పండ్లను రాముడు తినడం .. రావణుడి శివారాధన .. వానర సైన్యం వారధి దాటడం వంటి విజువల్స్ పై ట్రైలర్ కట్ చేశారు. 

ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. నిర్మాణ విలువల పరంగా .. గ్రాఫిక్స్ పరంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ నటించిన తొలి పౌరాణిక చిత్రం కావడంతో అంతా ఆసక్తితో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.

Prabhas
Krithi Sanon
Saif Ali Khan
Adipurush Movie
  • Loading...

More Telugu News