Aishwarya Rajesh: మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు ఐశ్వర్య రాజేశ్!

Aishwarya Rajesh Special

  • చైల్డ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్ 
  • హీరోయిన్ గాను మంచి డిమాండ్
  • అడపా దడపా తెలుగులోను ఛాన్సులు 
  • ఈ నెల 12వ తేదీన మూడు భాషల్లో విడుదల

'మల్లెమొగ్గలు' హీరో రాజేశ్ కూతురు ఐశ్వర్య రాజేశ్ చెన్నైలోనే పుట్టి పెరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళంలో వరుస సినిమాలు చేసింది. ఆ తరువాత హీరోయిన్ గా కూడా అక్కడ దూసుకుపోతోంది. తెలుగులో 'వరల్డ్ ఫేమస్ లవర్' .. 'కౌసల్య కృష్ణమూర్తి' .. 'టక్  జగదీశ్' .. 'రిపబ్లిక్' సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఫర్హానా' రెడీ అవుతోంది. 

తాజాగా ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ .. " మా నాన్న .. మా మేనత్త తెలుగులో చాలా సినిమాలు చేశారు. అలాగే నాకు కూడా ఇక్కడ చాలా సినిమాలు చేయాలని ఉంది. కానీ ఇక్కడి నుంచి పెద్ద ప్రాజెక్టులేమీ రావడం లేదు. అందువల్లనే చేయలేకపోతున్నాను. అంతే తప్ప మరో కారణం ఏమీలేదు" అంది. 

'ఫర్హానా' తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో కూడా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ఒకటి చేయమని మా అమ్మ కూడా అడుగుతోంది. మంచి కథ వస్తే తప్పకుండా చేస్తాను. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

Aishwarya Rajesh
Actress
Kollywood
  • Loading...

More Telugu News