Dimple Hayathi: అలా చేస్తే నాకు సినిమాలే రావన్నారు: డింపుల్ హయతి

Dimple Hayathi Special

  • పెద్ద ప్రాజెక్టు ఒకటి ఆగిపోయిందన్న డింపుల్  
  • ఆ సినిమా కోసం మూడు ప్రాజెక్టులు వదులుకున్నానని వ్యాఖ్య
  • నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నానని వివరణ    

ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై అందాల సందడి చేస్తున్న కథానాయికల జాబితాలో డింపుల్ హయతి ఒకరుగా కనిపిస్తుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నేను ఒక పెద్ద సినిమా చేస్తుండగా. మూడు పెద్ద బ్యానర్ల నుంచి అవకాశాలు వచ్చాయి. డేట్స్ కుదరని కారణంగా ఆ అవకాశాలను వదిలేశాను. ఆల్రెడీ చేస్తున్న సినిమా కూడా పెద్దదే గనుక, ఆ తరువాత నాకు ఛాన్సులు వస్తాయని అనుకున్నాను" అని అన్నారు. 

"అయితే కొన్ని కారణాల వలన చేస్తున్న సినిమా కూడా ఆగిపోయింది. దానిని నమ్ముకుని మూడు అవకాశాలు వదులుకున్నాను. ఆ సమయంలో ఏం చేయాలనేది నాకు తోచలేదు. అంతకుముందు 'గద్దలకొండ గణేశ్'లో లీడ్ రోల్ కోసం హరీశ్ శంకర్ గారు నన్ను అడిగారు. అప్పుడు కుదరక నేను చేయలేదు.

హరీశ్ గారు ఈ సినిమాలో ఐటమ్ చేయమని అడిగారు. కొంత స్టార్ డమ్ వచ్చాక ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేయవచ్చు. కానీ ఆరంభంలోనే ఐటమ్ సాంగ్స్ చేస్తే ఇక సినిమాలే రావని మా ఇంట్లోవారు అన్నారు. అయినా నేను ఆ స్పెషల్ సాంగ్ చేశాను .. అది నాకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. హిట్ .. ఫ్లాప్ అనేవి పక్కనే పెడితే, ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలబడటానికి ట్రై చేస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. 

Dimple Hayathi
Actress
Harish Shankar
  • Loading...

More Telugu News