Swiggy: ఓఎన్‌డీసీతో అతి తక్కువ ధరలకే ఫుడ్ డెలివరీ.. ఇక స్విగ్గీ, జొమోటోను మర్చిపోవాల్సిందే!

New food delivery platform ONDC offers food cheaper than Swiggy Zomato check details

  • స్విగ్గీ, జొమోటోలకు దీటుగా ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫాం
  • తక్కువ ధరలకే ఫుడ్ డెలివరీ
  • ఇటీవలే రోజుకు 10 వేల ఆర్డర్ల డెలివరీ మైలురాయిని చేరుకున్న వైనం
  • మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా రెస్టారెంట్లు నేరుగా కస్టమర్లకు ఆర్డర్ అందించే ఛాన్స్
  • భారత ప్రభుత్వం రూపొందించిన ఓఎన్‌డీసీకి పెరుగుతున్న పాప్యులారిటీ

ఫుడ్ డెలివరీకి జొమోటో, స్విగ్గీ యాప్స్ పర్యాయపదాలుగా మారిపోయాయి! ఈ వేదికలపై ఫుడ్ ఆర్డర్ చేయని నగరవాసి లేడంటే అతిశయోక్తి కాదేమో. కానీ వీటిల్లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఇప్పటికీ కాస్తంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే! మరి వీటికంటే తక్కువ ధరకు ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే అంతకంటే ఏం కావాలి చెప్పండి. అందుకే ప్రస్తుతం జొమోటో, స్విగ్గీలకు గట్టి పోటీ ఇస్తూ పాప్యులారిటీ పెంచుకుంటోంది ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫాం! ఇటీవలే ఓఎన్‌డీసీ రోజుకు 10 వేల ఆర్డర్ల డెలివరీ మైలురాయిని చేరుకుంది. మరో ప్రత్యేకత ఏంటంటే దీన్ని మన భారత ప్రభుత్వమే రూపొందించింది. ఇక ఓఎన్‌డీసీ పూర్తి వివరాలలోకి వెళితే...   

ఏమిటీ ఓఎన్‌డీసీ?
రెస్టారెంట్లు, హోటళ్లు నేరుగా కస్టమర్లకు ఫుడ్ చేరవేసేందుకు ఉద్దేశించిన వేదికే ఓఎన్‌డీసీ. ఓఎన్‌డీసీ అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. స్విగ్గీ, జొమోటో లాగే ఇందులో మూడో వ్యక్తి లేదా సంస్థ పాత్ర ఎంతమాత్రం లేకపోవడంతో చాలా తక్కువ ధరలకే ఆహారం అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు స్విగ్గీ, జొమోటోల్లో సగటున రూ.212 పలికే ఆర్డర్‌ను ఓఎన్‌డీసీలో కేవలం రూ.142కే పొందవచ్చు. ఫుడ్ మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువులు, ఫర్నిచర్ లాంటి ఎన్నో వస్తువులు ఇందులో ఆర్డర్ పెడితే నేరుగా ఇంటికి డెలివరీ అవుతాయి. 

ఎప్పుడు  ప్రారంభమైదంటే..
గతేడాది సెప్టెంబర్‌లో తొలుత బెంగళూరులో ఇది ప్రారంభమైంది. క్రమంగా దేశంలోని అన్ని నగరాలకు విస్తరిస్తోంది. 

ఓఎన్‌డీసీలో ఆర్డర్ చేసేదిలా..  
పేటీఎం, మీషో వంటి బయ్యర్ యాప్స్ ద్వారా ఓఎన్‌డీసీలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఉదాహరణకు పేటీఎం సెర్చ్ బార్‌లో ఓఎన్‌డీసీ అని టైప్ చేస్తే ఆహారం నుంచి నిత్యావసరాల వరకూ రకరకాల ఆప్షన్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిల్లోంచి మనకు కావాల్సింది ఎంచుకుని ఆర్డర్ పెట్టవచ్చు. ఇందులో తక్కువ ధరలకే ఆర్డర్స్ పొందిన కస్టమర్లు తమ ఆర్డర్ల తాలూకు స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఓఎన్‌డీసీ పాప్యులారిటీ క్రమంగా పెరుగుతోంది. మార్కెట్‌కు ఇది ఇంకా కొత్త కావడంతో ప్రముఖ రెస్టారెంట్లు అన్నీ ప్రస్తుతం ఇందులో అందుబాటులో లేవు. అయితే, ఓఎన్‌డీసీ నుంచి స్విగ్గీ, జొమోటో వంటి వాటికి పోటీ తప్పదనేది మార్కెట్ వర్గాల అంచనా.

  • Loading...

More Telugu News