Chhattisgarh: చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్... నక్సల్ దంపతుల మృతి

Encounter in Chhattisgarh

  • సుక్మా జిల్లాలో భద్రతాబలగాలకు, నక్సల్ కు మధ్య కాల్పులు
  • గొల్లపల్లి ఎస్ఓఎస్ కమాండర్ మద్కమ్, ఆయన భార్య మృతి
  • మద్కమ్ పై రూ.8 లక్షలు, ఆయన భార్యపై రూ.3 లక్షల రివార్డు

చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఈ ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్ దంపతులు మృతి చెందారు. మరణించిన నక్సల్ దంపతులను గొల్లపల్లి ఎస్ఓఎస్ కమాండర్ మద్కమ్, ఆయన భార్య పొడియం భీంగా గుర్తించారు. మద్కమ్ పై రూ.8 లక్షలు, ఆయన భార్యపై రూ.3 లక్షల రివార్డు ఉంది. 

సుక్మా జిల్లాలోని భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్ పురం అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కాగా, సంఘటన స్థలి నుంచి ఓ ఆటోమేటిక్ ఆయుధం, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల ఘటనలో మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్టు భావిస్తున్నారు. వారి కోసం కూంబింగ్ జరుగుతోంది.

Chhattisgarh
Encounter
Maoists
  • Loading...

More Telugu News