Naga Chaitanya: ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్: చైతూ

Nagachaitanya Interview

  • 'కస్టడీ' ప్రమోషన్స్ లో బిజీగా చైతూ
  • అఖిల్ కి సెట్ అయ్యే కథలు ఆయనకి పంపిస్తానని వెల్లడి
  • తండ్రి భరోసా పూర్తిగా ఉందని వ్యాఖ్య 
  • సొంతంగా ఎదగడంలో ఆనందం ఉందన్న చైతూ
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల 

నాగచైతన్య తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కస్టడీ' రెడీ అవుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 12వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో చైతూ బిజీగా ఉన్నాడు.

తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ .. 'కస్టడీ' సినిమా కథ నాకు కరెక్టుగా సరిపోతుంది .. అందువలన నేను చేశాను. ఒకవేళ ఏ కథైనా అఖిల్ కి బాగుంటుందని అనుకుంటే, ఆయన దగ్గరికి పంపిస్తాను. నాకు ఫలానా డైరెక్టర్ తో సినిమా చేయాలనుందని నాన్నతో చెబితే, ప్రాజెక్టు సెట్ చేయడానికి ఎంతో సమయం పట్టదు. కానీ నా అంతట నేనుగా ఎదగాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాను" అని అన్నాడు.

ఇక పరశురామ్ తో ప్రాజెక్టు గురించిన ప్రస్తావన రాగానే, "ఆయన గురించి మాట్లాడటం టైమ్ వేస్టు. నా టైమ్ ఆయన చాలా వేస్టు చేశాడు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం వలన మీ టైమ్ .. నా టైమ్ వేస్టు అవుతుంది" అంటూ ఆ తరువాత మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. మహేశ్ బాబు 'సర్కారువారి పాట' సినిమా కోసం, చైతూ ప్రాజెక్టును వదిలేసి పరశురామ్ వెళ్లాడనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

Naga Chaitanya
Krithi Shetty
Venkat Prabhu
Custody Movie
  • Loading...

More Telugu News