Vijay Antony: 'బిచ్చగాడు 2'లో ప్రత్యేక ఆకర్షణగా కావ్య థాపర్!

- సంచలన విజయాన్ని సాధించిన 'బిచ్చగాడు'
- ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'బిచ్చగాడు 2'
- మే 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు
- కథానాయికగా నటించిన కావ్య థాపర్
తెలుగులోకి ఎప్పటికప్పుడు చాలా అనువాద చిత్రాలు వస్తుంటాయి. కంటెంట్ ఉంటే చాలు .. ఇక్కడి ప్రేక్షకులు భారీ విజయాన్ని ముట్టజెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏ భాషలో అయితే రూపొందిందో ఆ భాషతో పాటు ఇతర భాషల్లోను సమానమైన ఆదరణ పొందిన సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటిగా 'బిచ్చగాడు' కనిపిస్తుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా 'బిచ్చగాడు 2' ప్రేక్షకుల ముందుకు రానుంది.
విజయ్ ఆంటోని హీరోగా చేసిన 'బిచ్చగాడు' తెలుగులో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాలో సత్నా టైటస్ కథానాయికగా నటించగా, 'బిచ్చగాడు 2'లో కావ్య థాపర్ అలరించనుంది. 2013లోనే కథానాయికగా ఆమె కెరియర్ మొదలైంది. 2018లో 'ఈ మాయ పేరేమిటో' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. 'ఏక్ మినీ కథ' సినిమాతో ఆమెకి ఇక్కడ మంచి గుర్తింపు వచ్చింది.
