Satyam Babu: ఆయేషా మీరాను హత్య చేసిన వాళ్లెవరో ఆమె తల్లి మొదటి నుంచి చెపుతూనే ఉన్నారు: సత్యంబాబు
- అయేషా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్న సత్యంబాబు
- హత్య జరిగి 15 ఏళ్లు గడుస్తున్నా నిందితులను పట్టుకోలేదని విమర్శ
- తనకు ఇంతవరకు పరిహారం చెల్లించలేదని ఆవేదన
ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొన్నేళ్ల పాటు జైల్లో గడిపి నిర్దోషిగా బయటకు వచ్చిన సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయేషాను చంపింది ఎవరనే విషయాన్ని ఆమె తల్లి ఎప్పటి నుంచో చెపుతున్నారని... కానీ, పోలీసులు ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు తనను నాలుగు సార్లు విచారించిందని, ఇప్పుడు మరోసారి విచారించబోతోందని, సీబీఐ విచారణకు సహకరిస్తానని చెప్పాడు.