Elon Musk: కుమారుడు X Æ A XII మూడో పుట్టిన రోజున మస్క్ ట్వీట్
![Elon Musk son birthday with super cute](https://imgd.ap7am.com/thumbnail/cr-20230505tn6454b1e8b9b1e.jpg)
- గాయని గ్రిమ్స్ తో కలిగిన మొదటి సంతానం
- కుమారుడితో కలసి ఉన్న ఫొటో షేర్
- నాలుగో పుట్టిన రోజూ నీతోనే అంటూ ట్వీట్
టెస్లా, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ ప్రజలకు సుపరిచితుడు. ఏది చేసినా భిన్నంగా ఉండాలని ఆయన కోరుకుంటుంటారు. తన ఉత్పత్తులు, కంపెనీ సేవల్లో ప్రత్యేకత కోసం మస్క్ కృషి చేస్తుంటారు. తన కుమారులకు సైతం ఆయన వెరైటీగా, ప్రపంచంలో మరెవరూ పెట్టుకోలేని విధంగా నామకరణాలు చేసేశారు. ఎలాన్ మస్క్ కు ముగ్గురు మహిళలతో మొత్తం 10 మంది పిల్లలు ఉన్నారు. ఒకరు చిన్నతనంలోనే మరణించారు.