Supreme Court: ఆ స్థానంలో మరొకరికి అవకాశం కోసం... రాజధాని అమరావతిపై సుప్రీంలో రైతుల పిటిషన్

Amaravati farmers files petition in Supreme Court
  • రైతుల ఎల్ఆర్ అప్లికేషన్‌పై మే 9న సుప్రీం కోర్టులో విచారణ
  • జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ
  • అమరావతి కేసులో జులై 11న విచారణ
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేసులపై సుప్రీంకోర్టులో జూలై 11వ తేదీన విచారణ జరగనుంది. గతంలో ఇందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన వారు చనిపోయారని, ఆ పిటిషనర్స్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలని పలువురు రైతులు ఎల్ఆర్ అప్లికేషన్ దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన తాజా పిటిషన్ పై మే 9వ తేదీన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. 

కాగా, రాజధాని అమరావతి కేసును గత విచారణలో అత్యున్నత న్యాయస్థానం జులై 11వ తేదీకి వాయిదా వేసింది. అయితే రైతుల ఎల్ఆర్ అప్లికేషన్ మే 9వ తేదీన జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు రానుంది.
Supreme Court
Amaravati
farmer

More Telugu News