Naga Chaitanya: 'కస్టడీ' కోసం నన్ను ఎంచుకోవడానికి కారణం ఇదే: చైతూ

Custody Movie Press Meet

  • చైతూ హీరోగా రూపొందిన 'కస్టడీ'
  • వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన సినిమా 
  • కీలకమైన పాత్రను పోషించిన అరవింద్ స్వామి 
  • మే 12వ తేదీన విడుదల కానున్న సినిమా

ఒక వైపున తెలుగు దర్శకులతో తమిళ హీరోలు ద్విభాషా చిత్రాలు చేస్తుంటే, మరో వైపున తమిళ దర్శకులతో ఇక్కడి హీరోలు ద్విభాషా చిత్రాలు చేయడం మొదలుపెట్టారు. అలాంటి సినిమాల జాబితాలో, వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగఛైతన్య కథానాయకుడిగా చేసిన 'కస్టడీ' ఒకటిగా కనిపిస్తోంది. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చైతూ మాట్లాడుతూ .. "ఈ సినిమా టీజర్ కి తెలుగు .. తమిళ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ను ఈ నెల 5వ తేదీన విడుదల చేయనున్నాము. రెండేళ్ల క్రితం వెంకట్ ప్రభుగారు నాకు ఈ సినిమా లైన్ చెప్పారు. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అందువల్లనే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను" అన్నాడు. 

"తమిళంలో చాలామంది హీరోలు ఉండగా నాతోనే ఈ సినిమాను ఎందుకు చేయాలనుకుంటున్నారు? అని వెంకట్ ప్రభు గారిని అడిగాను. 'లవ్ స్టోరీ' సినిమాలో మీ పెర్ఫార్మెన్స్ నచ్చింది .. 'కస్టడీ'కి మీరే కరెక్టు అనుకున్నాను' అన్నారు. తెలుగులో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు .. తమిళంలో చేయాలనే తపనతో నేను ఉన్నాను. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ వంటి సీనియర్స్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది" అని చెప్పుకొచ్చారు. 

Naga Chaitanya
Krithi Shetty
Aravinda Swami
Sarath Kumar
  • Loading...

More Telugu News