Vijay Devarakonda: క్రేజీ కాంబినేషన్.. విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల

Vijay devarakonda and srileela new movie begins
  • గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కొత్త చిత్రం
  • ఈ రోజు పూజతో ప్రారంభమైన సినిమా
  • జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్
లైగర్ డిజాస్టర్ తర్వాత మళ్లీ ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు యువ హీరో విజయ్ దేవరకొండ. సమంతతో కలిసి చేస్తున్న ‘ఖుషీ’పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఆ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ‘జెర్సీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. విజయ్ ఇది 12వ సినిమా.

 ఈ క్రేజీ కాంబినేషన్  చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. హీరో హీరోయిన్లపై  ముహూర్తపు షాట్‌కి ప్రగతి ప్రింటర్స్ ఎండీ పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేయగా, ఆనరరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ సౌత్ కొరియా చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) తన చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అప్పుడే అంచనాలను పెంచింది. ఇంతకు ముందే ఓ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేయగా. అందులో విజయ్ దేవరకొండ పోలీస్ గెటప్ లో కనిపించాడు. ఈ లెక్కన తన కెరీర్‌లో తొలిసారి విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్ర చేయబోతున్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి జరుగనుంది.
Vijay Devarakonda
srileela
new movie

More Telugu News