chikoti praveen: అది ఇల్లీగల్ అని నాకు తెలియదు: థాయ్‌లాండ్‌లో తన అరెస్ట్‌పై చికోటి ప్రవీణ్

Chikoti Praveen respons on his arrest in Thailand

  • పోకర్న్ నిర్వహిస్తుండగా 83 మంది అరెస్ట్
  • చికోటి సహా 84 మందికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
  • తాను ఆర్గనైజర్ ను కాదని, ఆహ్వానం మీద వచ్చానని వెల్లడి
  • పోకర్న్ లీగల్ అని చెబితే వచ్చానని, ఇల్లీగల్ అని తెలియదని వ్యాఖ్య

చికోటి ప్రవీణ్ థాయ్ లాండ్ లో అరెస్టై, ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఓ హోటల్ లో పోకర్న్ నిర్వహిస్తుండగా చికోటి సహా 83 మంది పట్టుబడ్డారు. ఆ తర్వాత వీరందరికీ బెయిల్ లభించింది. రూ.4500 జరిమానా కట్టిన అనంతరం బెయిల్ వచ్చింది. చికోటి ప్రవీణ్ ఫైన్ చెల్లించడంతో స్థానిక కోర్టు పాస్ పోర్టులను తిరిగి ఇచ్చింది.  

ఈ సందర్భంగా చికోటి మాట్లాడుతూ.. తాను ఆర్గనైజర్ ను కాదని, తన పేరు ఎక్కడా లేదని చెప్పాడు. దేవ్, సీత తనకు ఆహ్వానం పంపిస్తే మాత్రమే థాయ్ లాండ్ వచ్చినట్లు చెప్పాడు. నాలుగు రోజులు పోకర్న్ టోర్నమెంట్ ఉంటుందని చెప్పారని, అది కూడా లీగల్ అని చెప్పారని పేర్కొన్నారు. అందులో స్టాంప్స్ కూడా పంపించినట్లు చెప్పారు. కానీ థాయ్ లాండ్ లో పోకర్న్ ఇల్లీగల్ అని తనకు తెలియదన్నారు.

chikoti praveen
thailand
  • Loading...

More Telugu News