Ramanayaudu: రామానాయుడుగారి గురించి నాకు తెలిసింది ఇదే: డైరెక్టర్ బోయిన సుబ్బారావు

Boina Subba Rao Interview

  • రామానాయుడుతో తన ప్రయాణం గురించి ప్రస్తావించిన సుబ్బారావు 
  • ఫ్లాప్ కి ఆయన ఎవరినీ బాధ్యులను చేయరని వ్యాఖ్య 
  • ఆ సెంటిమెంటును ఆయన ఫాలో అయ్యేవారని వెల్లడి

డైరెక్టర్ బోయిన సుబ్బారావు పేరు చెప్పగానే ఆయన నుంచి వచ్చిన సినిమాల జాబితా కళ్లముందు కదలాడుతుంది. కుటుంబ నేపథ్యంలో నడిచే ఎన్నో కథలను ఆయన తెరకెక్కించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"నేను పుట్టి పెరిగింది 'కారంచేడు'లో. కాలేజ్ రోజుల్లో నాకు సినిమాల పిచ్చి ఎక్కువగా ఉండేది. మద్రాసు వెళ్లిన నేను అక్కడ ఎడిటర్ గా వర్క్ నేర్చుకుంటున్నాను. రామానాయుడిగారిది కూడా మా ఊరే. నా క్రమశిక్షణ నచ్చి నన్ను ఆయన దర్శకత్వం దిశగా ప్రోత్సహించారు. అలా ఆయన వలన నేను దర్శకుడినయ్యాను" అని అన్నారు. 

"తన సినిమాలకి సంబంధించిన ప్రతి విషయంలోను రామానాయుడిగారి ప్రమేయం ఉండేది. ఆయన ఒకసారి కథ విన్నారంటే, ఇక దానిని మరిచిపోరు. అలా గుర్తుకులేని సినిమాలు సక్సెస్ కావని ఆయన భావించేవారు. కథ విన్న తరువాత టీమ్ లోని అందరినీ అభిప్రాయాలు చెప్పమని అడిగేవారు. ఆ తరువాతనే తాను నిర్ణయం తీసుకునేవారు" అని అన్నారు. 

"రామానాయుడు గారు నిర్మాతగా చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా, ఆయన ఎవరినీ ఏమీ అనేవారు కాదు. హీరో వల్లనో .. డైరెక్టర్ వల్లనో సినిమా పోయిందని ఎవరితోను అనేవారు కాదు. అది ఆయనలోని గొప్పతనంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. తరువాత ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అనే విషయాన్ని గురించి మాత్రమే ఆలోచన చేసేవారు" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News