anasuya: ‘విమానం’ నుంచి అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Anusuya first look poster revealed  from VIMANAM

  • శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వంలో విమానం    
  • చీరకట్టు, ముక్కుపుడకతో ఆకట్టుకునేలా ఫొటో
  • తెలుగు, తమిళ భాషల్లో జూన్ 9న విడుదల

న్యూస్ ప్రెజెంటర్, బుల్లితెర యాంకర్ నుంచి టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నటి అనసూయ. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర టాలీవుడ్ లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్కడి నుంచి ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా మాస్ రోల్స్ ఆమెకు బాగా క‌లిసొచ్చాయి. పుష్ప సినిమాలోనూ ఇలాంటి పాత్రతో ఆకట్టుకున్న అనసూయ తాజాగా మ‌రోసారి మాస్ క్యారెక్ట‌ర్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఆమె కీలక పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం విమానం. శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 

మే డే సంద‌ర్భంగా సోమ‌వారం అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. చీర‌క‌ట్టులో ముక్కుపుడ‌క ధ‌రించి గ‌ద్దెపై కూర్చొని నవ్వుతూ కనిపిస్తున్న అన‌సూయ ఫొటో ఆక్టటుకునేలా ఉంది. చిత్రంలో అనసూయది చాలా బలమైన పాత్ర అని వివరిస్తూ, ఈ సినిమాలోని సిన్నోడా ఓ సిన్నోడా అనే పాట‌ను రిలీజ్ చేశారు. తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆవిష్క‌రిస్తూ సాగిన ఈ పాట‌ను మంగ్లీ ఆల‌పించింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీ సినిమాస్ స్టూడియో, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మించారు. మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్ ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. 

More Telugu News