Keerthy Suresh: ఆమె ఓ సౌందర్య శిల్పం .. కీర్తి సురేశ్ లేటెస్ట్ పిక్స్!

Keerthi Suresh Special

  • 'మహానటి' తరువాత ఆలస్యమైన సక్సెస్ 
  • ఊరట కలిగించిన 'సర్కారువారి పాట' .. 'దసరా'
  • మనసులను దోచేస్తున్న ఆమె తాజా స్టిల్స్  

టాలీవుడ్ లో టాప్ త్రీ హీరోయిన్స్ లో ఒకరిగా కీర్తి సురేశ్ కనిపిస్తుంది. కీర్తి సురేశ్ నిన్ననో .. మొన్ననో కెమెరా ముందుకు వచ్చిన ఆర్టిస్ట్ కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మలయాళ సినిమాల్లో ఆమె మెప్పించింది. ఆమె తండ్రి సురేశ్ నటుడు .. నిర్మాత కూడా. ఇక తల్లి మేనక 80వ దశకంలో మలయాళ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. అలాంటి ఒక బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి కీర్తి సురేశ్ వచ్చింది. సినిమా వాతావరణంలో పెరిగిన కారణంగానే, మోతాదు మించకుండా ఏ పాత్రలో ఎంతవరకూ మెప్పించాలనేది తనకి తెలుసు. అలాంటి ఆమెకి కూడా 'మహానటి' తరువాత మరో సక్సెస్ ను అందుకోవడానికి చాలా సమయం పట్టింది.ఆ మధ్య ఆమె చేసిన 'సర్కారువారి పాట' .. ఇటీవల చేసిన 'దసరా' సూపర్ హిట్ కావడంతో ఆమె కాస్త తేలికగా ఊపిరి పీల్చుకుంది. తాజాగా వదిలిన ఆమె లేటెస్ట్ పిక్స్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. పాలరాతి శిల్పంలా కనిపిస్తూ, మనోహరమైన నవ్వుతో హృదయాలను దోచేస్తున్న ఆమె ఫొటోలను అభిమానులు అలా చూస్తుండిపోతున్నారంతే.

Keerthy Suresh
Actress
Tollywood
  • Loading...

More Telugu News