Nagababu: పవన్ కల్యాణ్ సుపరిపాలన అందిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు: నాగబాబు

People are eagerly wating for Pawan Kalyan government nagababu

  • వైసీపీ పాలనపై నాగబాబు ఆగ్రహం
  • విభజించు - పాలించు అనే సూత్రంతో ప్రజల్లో విద్వేషం నింపుతున్నారని వ్యాఖ్య
  • విధ్వంస పాలన అందిస్తున్న వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయన్న నాగబాబు

వైసీపీ పాలనపై ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. విభజించు - పాలించు అనే సూత్రంతో ప్రజల్లో విద్వేషం నింపుతూ రెచ్చగొడుతున్నారని విమర్శించారు. విధ్వంస పాలన అందిస్తున్న వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ సుపరిపాలన అందిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.

కాగా, నాగబాబుకు ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు గంగమ్మ జాతరకు ఆహ్వానం అందింది. కొన్ని కారణాల వల్ల ఈ జాతరకు వెళ్లకపోవడంపై ఆయన ట్విట్టర్ వేదికగా మధ్యాహ్నం క్షమాపణలు చెప్పారు. 'ఉమ్మడి కడప జిల్లా రాజుగుంట, రైల్వే కోడూరు గంగమ్మతల్లి జాతరకు నన్ను ప్రేమ పూర్వకంగా  ఆహ్వానించారు... కొన్ని అత్యవసర సమావేశాల వల్ల రాలేకపోతున్నాను..త్వరలో మీ అందరిని కలుస్తాను' అని ట్వీట్ చేశారు.

More Telugu News