YS Vivekananda Reddy: సీబీఐ అధికారులు రావడంతో ఇంటి తలుపులు వేసుకున్న వివేకా పీఏ

CBI officials went to YS Viveka PA Krishna Reddy house

  • వివేకా హత్య కేసు విచారణలో వేగం పెంచిన సీబీఐ
  • పులివెందులలో వివేకా పీఏ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు
  • ప్రస్తుతం బెయిల్ పై ఉన్న వివేకా పీఏ కృష్ణారెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా ఈరోజు సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చారు. కేసులో అనుమానితుడిగా ఉన్న వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. తన ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారని తెలిసిన కృష్ణారెడ్డి ఇంటి లోపలే ఉండి తలుపులు వేసుకున్నారు. దీంతో, ఇంటి బయటే కాసేపు నిరీక్షించిన అధికారులు తలుపులు తీయాలని ఆదేశించారు. కాసేపటి తర్వాత కృష్ణారెడ్డి ఇంటి తలుపులు తీశారు. ఆయనను ఇంట్లోనే సీబీఐ అధికారులు విచారించారు. ఇప్పటికే కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. కేసు విచారణ ముగింపు దశకు వస్తున్న తరుణంలో ఆయన వద్దకు మరోసారి సీబీఐ అధికారులు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Loading...

More Telugu News