KTR: తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించిన నేత కేసీఆర్: కేటీఆర్

KTR wishes to party workers on BRS formation day
  • బీఆర్స్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు
  • రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీకి కేసీఆర్ పురుడు పోశారన్న కేటీఆర్
  • అనతి కాలంలోనే దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపారని కితాబు
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించి, అనతికాలంలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత మన కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. 22 ఏండ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
KTR
KCR
BRS
Formation Day

More Telugu News