Rahul Gandhi: పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టుకు రాహుల్ గాంధీ

Rahul goes to Gujarat HC to pause conviction in Modi surname case

  • 'మోదీ' అనే ఇంటి పేరును అవమానించారనే పరువు నష్టం కేసులో రాహుల్ తాజా పిటిషన్ 
  • తనకు విధించిన శిక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థనను తిరస్కరించడంతో అప్పీల్
  • 2019లో 'మోదీ' అనే ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యలు

మోదీ అనే ఇంటి పేరును అవమానించారనే పరువు నష్టం దావా కేసులో శిక్ష పడిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో తనకు విధించిన శిక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థనను దిగువ కోర్టు తిరస్కరించడంతో రాహుల్ పై కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. 

2019లో కర్ణాటకలోని కోలార్ లో 'మోదీ' అనే  ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో గత నెలలో లోక్ సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాహుల్ శనివారం తన అధికారిక బంగ్లాను కూడా ఖాళీ చేశారు.

దొంగలందరికీ మోదీ అనే కామన్ పేరు ఎలా వచ్చింది అని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది. దీనిని కోర్టులో సవాల్ చేసేందుకు 30 రోజుల సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. తన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలని, తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 3న విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 13న ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పిటిషన్లను తిరస్కరించింది. దీంతో రాహుల్ హైకోర్టుకు వెళ్లారు.

  • Loading...

More Telugu News