Ram: 'ఇస్మార్ట్ శంకర్ 2' కోసం రంగంలోకి పూరి - రామ్!

Ram and Puri movie update

  • 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ కొట్టిన పూరి 
  • మాస్ హీరోగా మార్కులు రాబట్టిన రామ్ 
  • మ్యూజికల్ హిట్ గా నిలబెట్టిన మణిశర్మ 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సీక్వెల్ 

రచయితగా .. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన స్టైల్ ను ఇష్టపడే అభిమానులు ఎక్కువ. హీరోలకు మాస్ ఇమేజ్ ను తీసుకురావడంలో ఎవరైనా ఆయన తరువాతనే అని చెబుతుంటారు. ఆయన మాస్ డైలాగులను తమ హీరోల నోటివెంట వింటూ అభిమానులు క్లాప్స్ కొడుతుంటారు. 

అలా ఆయన నుంచి వచ్చిన పక్కా యాక్షన్ మూవీగా 'ఇస్మార్ట్ శంకర్' కనిపిస్తుంది. అప్పటివరకూ రామ్ కి ఉన్న చాక్లెట్ బాయ్ ఇమేజ్ ను పూరి ఈ సినిమాతో పూర్తిగా మార్చేశాడు. నిధి అగర్వాల్ - నభా నటేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చెయ్యడానికి అటు పూరి .. ఇటు రామ్ రంగంలోకి దిగుతున్నారని టాక్. బోయపాటితో చేస్తున్న సినిమా షూటింగు పూర్తిలాగానే, రామ్ సెట్స్ పైకి వెళ్లేది పూరితోనే అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' మ్యూజికల్ హిట్ గనుక, సీక్వెల్ లోను ఆయన ప్లేస్ కి ఎలాంటి ఢోకా ఉండదని చెప్పచ్చు. 

Ram
Puri Jagannadh
Manishrma
  • Loading...

More Telugu News