Vikram: 'పొన్నియిన్ సెల్వన్ 2'కి హైలైట్ గా నిలవనున్న త్రిష రొమాన్స్!

- ఈ నెల 28న విడుదలవుతున్న PS -2'
- ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సినిమా టీమ్
- త్రిష పాత్రకి పెరిగిన చోటు
- కార్తి పాత్రలో రొమాంటిక్ యాంగిల్
త్రిష కెరియర్ ను గమనిస్తే ఇక ఆమె పనైపోయిందని అనుకున్న ప్రతిసారీ మళ్లీ పుంజుకుంటూనే వచ్చింది. కెరియర్ పరంగా 20 ఏళ్లు పూర్తయినప్పటికీ, అవకాశాల కోసం వెయిట్ చేసే పరిస్థితిలో ఆమె లేదు. ఇంతకాలమైనా ఆమె గ్లామర్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఆమెనే కావాలని పట్టుబడుతున్న సందర్భాలు ఉన్నాయి.
అలాంటి త్రిష 'పొన్నియిన్ సెల్వన్ 1' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె 'కుందవై' అనే పాత్రలో కనిపిస్తుంది. ఈ పాత్ర ఎంత గొప్పదనే విషయం ఈ నవల చదివిన చాలామందికి తెలుసు. అలాంటి పాత్రలో ఈ సినిమాలో త్రిష అందంగా మెరిసింది. మణిరత్నం ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం గొప్పగా ఉంటుంది. అయితే ఫస్టు పార్టులో ఆమె మనసు వల్లవరాయన్ (కార్తి) వైపు మొగ్గుచూపుతున్నట్టుగా మాత్రమే చూపించారు.
