new secretariat: ఓపెనింగ్ కు సిద్ధమవుతున్న తెలంగాణ సెక్రటేరియట్.. ఫొటోలు వైరల్!

mlc kavitha shared photos of the new secretariat

  • ఈనెల 30న తెలంగాణ సచివాలయం ప్రారంభం
  • తుది దశకు చేరుకున్న పనులు
  • ఫొటోలను ట్వీట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

కొత్తగా నిర్మితమైన తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభం కోసం ముస్తాబవుతోంది. హుస్సేన్ సాగర్ తీరంలో కట్టిన సచివాలయం కోటను తలపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈనెల 30వ తేదీన తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులన్నీ తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయానికి సంబంధించిన ఫొటోలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో షేర్ చేశారు. నూతన సచివాలయం తెలంగాణ ప్రజల ఉనికికి, ప్రగతికి, అభివృద్ధికి పర్యాయపదంగా మార్చాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు.

తెలంగాణ సచివాలయాన్ని మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 265 అడుగుల ఎత్తున భవనాన్ని నిర్మించారు. 11 అంతస్తుల ఎత్తుతో ప్రధాన నిర్మాణం కనిపిస్తోంది. ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు. 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.

  • Loading...

More Telugu News