Tirumala: తిరుమల కొండపై వడగళ్ల వాన... వీడియో ఇదిగో!

Tirumala witnessed hailstorm

  • తిరుమలలో ఒక్కసారిగా మారిన వాతావరణం
  • బలమైన ఈదురుగాలులతో వడగళ్ల వర్షం
  • తడిసి ముద్దయిన తిరుమల
  • ఎండవేడిమి నుంచి భక్తులకు ఉపశమనం
  • షాపింగ్ కాంప్లెక్స్ లలోకి ప్రవేశించిన నీరు

ఏపీలో మండు వేసవిలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై వడగళ్ల వాన కురిసింది. తిరుమలలో ఈ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. వడగళ్లతో కూడిన వర్షం పడడంతో తిరుమల తడిసి ముద్దయింది. ఉదయం నుంచి ఎండవేడిమితో సతమతమైన శ్రీవారి భక్తులు ఉపశమనం పొందారు. పలు చోట్ల భారీగా వర్షపు నీరు ప్రవహించింది. పలు షాపింగ్ కాంప్లెక్స్ ల్లోకి నీరు ప్రవేశించింది. భక్తులు వర్షం ధాటికి షెడ్ల కిందికి పరుగులు తీశారు.

Tirumala
Hailstorm
Rain

More Telugu News