Virat Kohli: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నమోదు చేసిన రికార్డులివే...!

Kohli Breaks Multiple Records As Royal Challengers Bangalore Beat Punjab Kings

  • ఐపీఎల్ లో 6500 పరుగులు చేసిన మొదటి కెప్టెన్ గా కోహ్లీ ఘనత
  • అత్యధిక ఫోర్లు కొట్టిన మూడో ఆటగాడిగా నిలిచిన వైనం
  • ధావన్, వార్నర్ తర్వాత స్థానంలో కోహ్లీనే!

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ పలు రికార్డులు నమోదు చేశాడు. 24 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ పాత్ర ఎంతో ఉంది. అతను 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 59 పరుగులు చేశాడు. డుప్లెసిస్ కూడా 56 బంతుల్లో 84 పరుగులు చేశాడు.

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా కోహ్లీ నమోదు చేసిన రికార్డులు....

ఐపీఎల్ జట్ల కెప్టెన్ లలో 6500 పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడు కోహ్లీ.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 600 ఫోర్లు కొట్టిన మూడో బ్యాట్స్ మన్ విరాట్.

శిఖర్ ధావన్ (730 ఫోర్లు) మొదటి స్థానంలో, ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (608 ఫోర్లు) రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.

పంజాబ్ పైన గెలిచిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... మ్యాచ్ లో బాగా ఆడామని, డుప్లెసిస్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడని చెప్పాడు. తాము తమ భాగస్వామ్యాన్ని సాధ్యమైనంత ఎక్కువ సేపు పొడిగించాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. తాము ఇంకా 190-200 వద్ద లక్ష్యాన్ని ఉంచాలనుకున్నామని, కానీ ఈ పిచ్‌పై 175 మంచి స్కోరుగా భావించినట్లు చెప్పాడు. 

తాము ఆత్మవిశ్వాసంతో పంజాబ్ ఆటగాళ్ల వికెట్లు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు తమ జట్టు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉందన్నాడు.

  • Loading...

More Telugu News