Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ పిటిషన్ కొట్టివేతపై జైరాం రమేశ్ స్పందన

Surat court dismisses Rahul gandhi petition in criminal defamation case

  • శిక్షను నిలుపుదల చేయాలంటూ రాహుల్ వేసిన పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
  • ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
  • నేడు పత్రికాసమావేశంలో పూర్తి వివరాలు తెలుపుతామని వెల్లడి

‘మోదీ’ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యల తాలూకు పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరోసారి చుక్కెదురైంది. తనకు విధించిన శిక్షణను నిలుపుదల చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్‌ సెషన్స్ కోర్టు గురువారం కొట్టేసింది. అంతకుమునుపు.. కోర్టు రాహుల్‌తో నిష్కర్షగా వ్యవహరించిందని రాహుల్ తరపు న్యాయవాది వాదించినట్టు సమాచారం. ఎంపీగా రాహుల్‌కు ఉన్న స్థాయి కోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.  

ఈ పరిణామంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టప్రకారం తమకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామంటూ ట్వీట్ చేశారు. ఈ విషయమై నేటి సాయంత్రం నాలుగు గంటలకు అభిషేక్ మనూ సింఘ్వీ పత్రికాసమావేశం ఏర్పాటు చేశారని కూడా తెలిపారు. 

మోదీ పేరున్న వారందరినీ అవమానించారంటూ దాఖలైన నేరపూరిత పరువునష్టం కేసులో సూరత్‌లోని సెషన్స్ కోర్టు మార్చి 23న రాహుల్‌ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఈ తీర్పుపై రాహుల్ అప్పీలుకు వెళ్లారు. అయితే.. రాహుల్ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయినట్టు కేంద్ర ప్రభుత్వం..  తీర్పు వెలువడిన రెండో రోజునే ఓ ప్రకటించింది.

  • Loading...

More Telugu News