Samantha: లండన్ లో మెరిసిన సమంత .. ఆమె ధరించిన జువెలరీ ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!

- సమంత ఫ్యాన్స్ ను నిరాశపరిచిన 'శాకుంతలం'
- సిటాడెల్ వెబ్ సిరీస్ పనుల్లో పడిన సమంత
- లండన్ వీధుల్లో వరుణ్ ధావన్ తో కలిసి సందడి
- ఖరీదైన జువెలరీతో కట్టిపడేస్తున్న సమంత
సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'శాకుంతలం' ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా రిజల్టును గురించి పెద్దగా పట్టించుకోకుండా, ఆ తరువాత తాను చేయవలసిన వెబ్ సిరీస్ పై సమంత దృష్టి పెట్టింది. ప్రస్తుతం 'సిటాడెల్' వెబ్ సిరీస్ కోసం లండన్ వెళ్లిన ఆమె, అక్కడ ఖరీదైన డ్రెస్ తో .. జువెలరీతో మెరిసింది.


