YS Jagan: ఏపీ సీఎం జగన్ యూరప్ టూర్‌కు సీబీఐ కోర్టు అనుమతి

CBI court allows AP CM jagan to go on europe with family

  • బెయిల్ నిబంధనలకు సడలింపు ఇవ్వాలంటూ జగన్ విజ్ఞప్తి
  • ఈ నెల 17న కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ
  • మంగళవారం సీబీఐ కోర్టులో ముగిసిన విచారణ
  • ముఖ్యమంత్రి జగన్ యూరప్ టూర్‌కు కోర్టు పచ్చ జెండా

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి యూరప్ టూర్‌కు సీబీఐ అనుమతించింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యూరప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది. తన వ్యక్తిగత పర్యటనకు అనుమతించాలంటూ సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ పిటిషన్‌పై సీబీఐ ఈ నెల 17న కౌంటర్ దాఖలు చేయగా మంగళవారం కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో ఈ నెల 21 నుంచి 29 వరకూ జగన్ యూరప్ టూర్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, పర్యటనకు ముందు జగన్ తన మొబైల్ ఫోన్, ఈ-మెయిల్ ఐడీ, పర్యటన వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News