ముగిసిన అవినాశ్ రెడ్డి విచారణ
- 8 గంటలకు పైగా అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ
- వివేక హత్యకు మూడు గంటల ముందు ఏం జరిగిందని ప్రశ్నించినట్టు సమాచారం
- ఈ కేసులో అరెస్టయిన వారంతా మీతో ఎందుకు సమావేశమయ్యారని అవినాశ్‌కు ప్రశ్న
- మళ్లీ రేపు 10.30కు రావాలని సూచన
విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఉదయ్, భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా అవినాశ్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వివేకా హత్యకు మూడు గంటల ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించినట్టు, ఈ కేసులో అరెస్టయిన వారందరూ అవినాశ్‌తో ఎందుకు సమావేశమయ్యారో ఆరా తీసినట్టు సమాచారం. మళ్లీ రేపు 10.30కు రావాలని అవినాశ్ రెడ్డిని ఆదేశించారు. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి ఉదయ్, భాస్కర్ రెడ్డి విచారణ కూడా పూర్తి కావడంతో అధికారులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.