Jagan: హ్యాపీ బర్త్ డే అమ్మ: జగన్, షర్మిల విషెస్

Jagan birthday wishes to YS Vijayamma

  • నేడు వైఎస్ విజయమ్మ పుట్టినరోజు
  • తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్
  • తల్లిని ఆప్యాయంగా హత్తుకున్న ఫొటో షేర్ చేసిన సీఎం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన తల్లికి జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ ట్వీట్ చేశారు. తన తల్లిని ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను షేర్ చేశారు. మరోవైపు హైదరాబాద్ లోని నివాసంలో తన తల్లి పుట్టినరోజు వేడుకలను షర్మిల నిర్వహించారు. కేక్ కట్ చేసి తల్లికి తినిపించారు. ఇంకోవైపు పుట్టినరోజు సందర్భంగా విజయమ్మకు వైసీపీ, వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు.

Jagan
YSRCP
YS Vijayamma
Birthday

More Telugu News