Fire Accident: తిరుమల ఆస్థాన మండపంలో అగ్నిప్రమాదం

Fire accident in Tirumala

  • శ్రీవారి ఆలయం ఎదురుగా ఆస్థాన మండపం
  • ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశంలో చెలరేగిన మంటలు
  • మ్యాట్లకు నిప్పంటుకున్న వైనం
  • మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది
  • ఆకతాయిలే నిప్పంటించి ఉంటారని అనుమానం

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో మంటలు చెలరేగాయి. ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశంలో ఉన్న మ్యాట్లకు నిప్పంటుకుంది. అక్కడున్న వారు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కొందరు అకతాయిలే మ్యాట్లకు నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

Fire Accident
Asthana Mandapam
Tirumala
  • Loading...

More Telugu News