nipt: సంతానానికి ముందు దంపతులకు అవసరమైన పరీక్షలు..!
- నాన్ ఇన్వాసివ్ ప్రీనాటల్ టెస్ట్ ఎంతో కీలకం
- క్రోమోజోముల లోపాలుంటే ముందే తెలుస్తుంది
- ప్రాణాంతక వ్యాధుల రిస్క్ బయటపడుతుంది
దంపతులకు అత్యంత ముఖ్యమైన టాస్క్ సంతానం. పెళ్లయిన తర్వాత నుంచి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. గర్భం దాల్చిన వారికి వైద్యులు సాధారణంగా నాన్ ఇన్వాసివ్ ప్రీనాటల్ టెస్ట్ లను (ఎన్ఐపీటీ) సిఫారసు చేస్తుంటారు. దీనివల్ల గర్భంలోని శిశువు ఆరోగ్యం గురించి తెలుస్తుంది. అత్యాధునిక స్కానింగ్ యంత్రాల సాయంతో గర్భస్థ శిశువు ఆరోగ్యం గురించి నేడు వైద్యులు ముందే తెలుసుకుంటున్నారు.
శిశువులో క్రోమోజోముల డిజార్డర్ ఉంటే దాన్ని ఎన్ఐపీటీ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనివల్ల డౌన్ సిండ్రోమ్ (ట్రిసోమీ 21) తదితర సమస్యలు వచ్చేదుంటే తెలుస్తుంది. గర్భిణి రక్తంలో ప్రసరించే డీఎన్ఏ అవశేషాలను గుర్తిస్తుంది. గర్భిణి రక్త నమూనాతో పరీక్ష నిర్వహిస్తారు. క్రోమోజోముల లోపాలతో పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడమే ఈ పరీక్ష ఉద్దేశ్యం. ఈ ఒక్క పరీక్షతో ట్రిసోమీ 21, ట్రిసోమీ 18, ట్రిసోమీ 13, సెక్స్ క్రోమోజోమ్ అనెపులోడీస్, ట్రిజోమీ 9, ట్రిజోమీ 16, ట్రిజోమీ 22 ను ముందే గుర్తించొచ్చు. ఇలాంటివి గుర్తించినప్పుడు గర్భాన్ని తొలగించుకోవాలని కూడా వైద్యులు సిఫారస్ చేయవచ్చు.