Japan: స్మోక్‌ బాంబుతో జపాన్ ప్రధానిపై దాడి!

Japan PM Kishida attacked with smoke bomb

  • వకయామాలో ప్రధాని ప్రసంగించడానికి ముందు స్మోక్ బాంబు పేలుడు
  • కిషడాను సురక్షితంగా అక్కడి నుంచి తరలించిన భద్రతా సిబ్బంది
  • వకయామా నంబర్-1 జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వకయామాలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ స్మోక్‌బాంబు భారీ శబ్దంతో పేలింది. వెంటనే అప్రమత్తమైన ప్రధాని భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. వకయామా నగరంలో ఆయన ప్రసంగించడానికి ముందు దుండగులు పైప్ బాంబు విసిరారు. 

అది పెద్ద శబ్దంతో పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వకయామాలోని ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన తర్వాత ఆయన ప్రసంగించడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది. వకయామా నంబర్-1 జిల్లాలో ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రధాని ప్రసంగించాల్సి ఉండగా ఈ ఘటన జరిగినట్టు తెలిపింది. పేలుడు నేపథ్యంలో ప్రధాని కిషిడా ప్రసంగం రద్దయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News