Gujarat Titans: హార్దిక్ పాండ్యా పునరాగమనం... టాస్ గెలిచిన టైటాన్స్

Gujarat Titans won the toss

  • ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్ × పంజాబ్ కింగ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
  • తొలి ఓవర్లోనే వికెట్ తీసిన షమీ

ఐపీఎల్-16లో గత కొన్నిరోజులుగా దాదాపు ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇవాళ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమీ తొలి ఓవర్లోనే వికెట్ తీసి జట్టులో ఉత్సాహం నింపాడు. 

షమీ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ మిడ్ వికెట్ లో రషీద్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 2 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 16 పరుగులు కాగా... క్రీజులో ఓపెనర్ శిఖర్ ధావన్ (8 బ్యాటింగ్), మాథ్యూ షార్ట్ (8 బ్యాటింగ్) ఆడుతున్నారు. 

కాగా, గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి వచ్చాడు. గత మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఆడని విషయం తెలిసిందే. అయితే, అతడి స్థానంలో రషీద్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

Gujarat Titans
Toss
Punjab Kings
Hardik Pandya
IPL
  • Loading...

More Telugu News