Sampoornesh Babu: సంపూర్ణేశ్ బాబు సందడి ఎక్కడా కనిపించదేం?

sampoornesh Babu Special

  • హీరోగా సంపూకి మంచి క్రేజ్
  • చిన్న సినిమాలతో పెద్ద హిట్లు కొట్టిన సంపూ 
  • 'కొబ్బరి మట్ట' తరువాత తగ్గిన జోరు 
  • అభిమానుల్లో తలెత్తిన సందేహాలు

టాలీవుడ్ లో సంపూర్ణేశ్ బాబుకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకి మంచి డిమాండ్ కూడా ఉంది. అలాంటి సంపూ కొంతకాలంగా ఎలాంటి కొత్త ప్రాజెక్టులోనూ కనిపించడం లేదు. హీరోగాగానీ .. కీలకమైన పాత్రలకి సంబంధించిగాని ఆయన పేరు వినిపించడం లేదు. దాంతో ఆయన గురించిన టాక్ అక్కడక్కడా నడుస్తూనే ఉంది. 

నిజానికి సంపూ చేసిన సినిమాలు చాలా చిన్నవి. ఆయన చేసిన కామెడీలో కూడా ఇమిటేషన్ ఎక్కువగా ఉండేది. అయినా ఆయనను అలా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అందుకు కారణం ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ అనే చెప్పాలి. ఆ మధ్య వచ్చిన 'కొబ్బరి మట్ట' ఆయన కెరియర్లో పెద్ద హిట్ గా చెప్పుకోవాలి.

ఆ తరువాత ఆయన నుంచి వరుస సినిమాలు వచ్చాయి. ఆ జాబితాలో 'బజార్ రౌడీ'.. 'క్యాలీ ఫ్లవర్' కనిపిస్తాయి. ఆకాశ్ పూరి హీరోగా చేసిన 'చోర్ బజార్' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను కూడా చేశాడు. ఆ తరువాత ఇంతవరకూ ఆయన తెరపై కనిపించలేదు. అందుకు కారణం ఏమిటనేది తెలియడం లేదు. చిన్న సినిమాల సందడి పెరుగుతున్న సమయంలో సంపూ సందడి తగ్గడం అభిమానులను ఆలోచనలో పడేస్తోంది. 

Sampoornesh Babu
Actor
Tollywood
  • Loading...

More Telugu News