Pavan Kalyan: 'వకీల్ సాబ్' కి సీక్వెల్ రెడీ చేస్తున్నా: వేణు శ్రీరామ్

Venu Sri Ram Interview

  • 'ఓ మై ఫ్రెండ్'తో పరిచయమైన వేణు శ్రీరామ్ 
  • 'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో గుర్తింపు 
  • 'వకీల్ సాబ్'తో తొలి బ్లాక్ బస్టర్ 
  • నిన్నటితో రెండేళ్లు పూర్తిచేసుకున్న సినిమా 

'ఓ మై ఫ్రెండ్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన వేణు శ్రీరామ్, ఆ తరువాత 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు. అందువలన ఆయన వేణు శ్రీరామ్ తో, పవన్ కల్యాణ్ హీరోగా 'వకీలు సాబ్' సినిమా చేశాడు. ఇది రీమేక్ .. కథాబలం ఉన్న ఈ సినిమా ఇక్కడ కూడా హిట్ అయింది. పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

దాంతో వేణు శ్రీరామ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ హీరోగా 'ఐకాన్' సినిమా చేయాలని దిల్ రాజు అనుకున్నాడుగానీ కుదరలేదు. ఎందుకనో గానీ బన్నీ ఈ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తిని చూపలేదు. ఆ కథపై చాలాకాలం పాటు కసరత్తూ చేస్తూ వచ్చిన వేణు శ్రీరామ్ మొత్తానికి దానిని పక్కన పెట్టేశాడు. 'వకీల్ సాబ్ 2' కి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా చెప్పాడు.

నిన్నటితో ఈ సినిమా రెండేళ్లను పూర్తిచేసుకుంది. అందువలన ఈ సినిమాను గురించిన సందడి సోషల్ మీడియా వేదికపై కనిపించింది. ఈ సినిమా సాధించిన సక్సెస్ ను గురించి వేణు శ్రీరామ్ గుర్తు చేసుకుంటూ, ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని గట్టిగానే చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథను రెడీ చేస్తున్నానని అన్నాడు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పాడు. దాంతో ఇప్పుడు అభిమానులందరి దృష్టి అటు వైపు మళ్లింది. 

Pavan Kalyan
Rana
Nithya Menon
Samyuktha Menon
Vakeel Saab
  • Loading...

More Telugu News