MS Dhoni: ప్లీజ్ సర్.. ధోనికి విమానం పైలట్ విజ్ఞప్తి ఇది

Pilot request dhoni continue as csk team captain
  • మహేంద్ర సింగ్ ధోని ప్రయాణిస్తున్న విమానంలో ఆసక్తికర ఘటన
  • ధోనికి తను పెద్ద ఫ్యాన్ అంటూ పైలట్ ప్రకటన
  • సీఎస్‌కే సారథిగా కొనసాగండంటూ విజ్ఞప్తి
  • నెట్టింట వీడియోలు వైరల్
టీం ఇండియా మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోని‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టీమిండియా కెప్టెన్‌గానే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కూడా ఆయన ఫ్యాన్స్ మన్ననలు పొందారు. మ్యాచ్‌ల్లోనే కాకుండా.. ధోని ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు చూసేందుకూ అభిమానులు వేలల్లో తరలివస్తారు. ప్రస్తుతం 41 ఏళ్ల వయసున్న ధోనికి ఈ ఐపీఎల్ చివరిదన్న టాక్ వినిపిస్తోంది. ఇది కచ్చితంగా అభిమానులకు నిరాశ కలిగించే వార్తే. అందుకే ఓ పైలట్ ఉండబట్టలేక తన మనసులో మాటను బయటపెట్టేశాడు. విమానం గాల్లో ఉండగానే ధోని మీకో రిక్వెస్ట్ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. 

ఇటీవల ధోని ఓ విమానంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ చిన్న అనౌన్స్‌మెంట్ అంటూ పైలట్ ధోనిపై తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. ‘‘నేను మీ ఫ్యాన్.. దయచేసి సీఎస్‌కే టీంకు కెప్టెన్‌గా కొనసాగండి. ఇది మా రిక్వెస్ట్’’ అంటూ పైలట్ చేసిన అనౌన్స్‌మెంట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ సమయంలో విమానంలో ధోనితో పాటూ సీఎస్‌కే టీం మొత్తం ఉంది.
MS Dhoni
IPL

More Telugu News