Narendra Modi: హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ

Modi stated many projects in Telangana

  • తెలంగాణలో రూ. 11,300 కోట్ల పనులను ప్రారంభించిన ప్రధాని
  • సికింద్రాబాద్ స్టేషన్లో రూ. 720 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
  • టీఎస్ ప్రభుత్వం తరపున హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్

భారత ప్రధాని మోదీ తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణలో రూ. 11,300 కోట్ల పనులను ఆయన ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూ. 720 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. జంట నగరాలకు సంబంధించి 13 ఎంఎంటీఎస్ రైళ్లను మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైల్లో చైర్ కార్ ఛార్జీలు రూ. 1,680గా... ఎగ్జిక్యూటివ్ ఛార్జీ రూ. 3,080గా నిర్ణయించారు. ప్రస్తుతం ప్రధాని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News