Chandrababu: ఎవరు పొరపాటు చేసినా కరెక్ట్ చేసే బటన్ నా చేతిలో ఉంది: చంద్రబాబు

Chandrababu speech in TDP Zone 4 meeting

  • నెల్లూరులో టీడీపీ జోన్-4 సమావేశం
  • సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు రేణిగుంట పయనం
  • అక్కడ్నించి విమానంలో గన్నవరం వెళ్లనున్న టీడీపీ అధినేత

నెల్లూరులో టీడీపీ జోన్-4 సమావేశం ముగిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు నుంచి రేణిగుంటకు రోడ్డు మార్గంలో పయనమయ్యారు. రేణిగుంట నుంచి విమానంలో ఆయన గన్నవరం చేరుకుంటారు. 

కాగా, జోన్-4 సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని, ఓ క్యాన్సర్ గడ్డ లాంటి వాడని విమర్శించారు. ఆ క్యాన్సర్ గడ్డను ఆపరేషన్ చేసి వెంటనే తొలగించాలని అన్నారు. 

టెక్నాలజీ అంటే తానే గుర్తుకు వస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆనాడు తాము తీసుకున్న నిర్ణయాల వల్లే టెక్నాలజీ రంగంలో తెలుగువాళ్లు రాణిస్తున్నారని వివరించారు. ఎవరు పొరపాటు చేసినా కరెక్ట్ చేసే బటన్ తన చేతిలో ఉందని స్పష్టం చేశారు. 

పార్టీ కోసం పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో కార్యకర్తలు పాలుపంచుకోవాలని సూచించారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థను ప్రతి కుటుంబంలోకి తీసుకెళతామని వెల్లడించారు.

Chandrababu
TDP
Zone-4
Nellore
Andhra Pradesh
  • Loading...

More Telugu News