మహేశ్ బాబు కొత్త లుక్ అదుర్స్.. ప్రిన్స్ స్వయంగా షేర్ చేసిన ఫొటోలు ఇవిగో!
- ఓ వస్త్ర కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న టాలీవుడ్ స్టార్
- ఆ కంపెనీ షర్ట్స్ వేసుకొని ఫొటో షూట్
- ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్
త్రివిక్రమ్ సినిమా కోసం కొంచెం ఒత్తయిన హెయిర్ స్టయిల్ లో మహేశ్ లుక్స్ కేక పుట్టిస్తున్నాయి. ప్రముఖ వస్త్రాల కంపెనీ ఒట్టో ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఫొటోలను తీశారు. ఒట్టో షర్ట్స్ వేసుకున్న మహేశ్ ఫొటోలు ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. కాగా, మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో పని చేయనున్నారు.