Samantha: సిటాడెల్... హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా... హిందీలో సమంత!

Samantha acts in Citadel series

  • హాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించిన ప్రియాంక చోప్రా
  • కొన్ని మార్పులతో భారతీయ వెర్షన్ రూపొందిస్తున్న రాజ్-డీకే
  • సమంత గొప్ప నటి అని కితాబిచ్చిన ప్రియాంక చోప్రా
  • నటన గురించి ఆమెకు తాను చెప్పాల్సిందేమీ లేదని వెల్లడి

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు, అంతర్జాతీయ వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది. హాలీవుడ్ లో రూపుదిద్దుకున్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లోనూ ప్రియాంక చోప్రా నటించింది. ఇప్పుడు సిటాడెల్ ను బాలీవుడ్ లోనూ తెరకెక్కిస్తున్నారు. 

అయితే, ఒరిజనల్ వెర్షన్ కు కొన్ని మార్పులు చేసి అదే పేరుతో చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రను బాలీవుడ్ సిటాడెల్ లో సమంత పోషిస్తోంది. అందుకోసం సమంత మార్షల్ ఆర్ట్స్ లోనూ ట్రైనింగ్ పొందింది. ఇటీవల సమంత గాయపడింది ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లోనే. ఇందులో వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నాడు. 

దీనిపై ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా స్పందించింది. సమంత, వరుణ్ ధావన్ లు ఈ వెబ్ సిరీస్ లో ఎలా నటించాలని తాను చెప్పబోనని, వాళ్లిద్దరూ ఉన్నతస్థాయి నటులని కొనియాడింది. సిటాడెల్ చిత్రీకరణ గొప్పగా సాగుతోందని వరుణ్ ధావన్ చెప్పాడని ప్రియాంక చోప్రా వెల్లడించింది. రాజ్-డీకే ఎంతో టాలెంట్ ఉన్న దర్శకులని, సిటాడెల్ భారతీయ వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది.

More Telugu News