Mahesh Babu: ఈ హీరోలకు నేను ఒక్క కాల్ చేస్తే చాలు: డైరెక్టర్ గుణశేఖర్

Gunsekhar Interview

  • 'శాకుంతలం' ప్రమోషన్స్ లో గుణశేఖర్ 
  • 'ఒక్కడు' సినిమా గురించిన ప్రస్తావన 
  • తనపై ఆ అపవాదు ఉందని వెల్లడి 
  • అవసరమైతేనే సెట్స్ వేయిస్తానని వ్యాఖ్య 


గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'శాకుంతలం' ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ తో ఆయన బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "కథా నేపథ్యం డిఫరెంట్ గా ఉండాలనే దిశగా నేను ఆలోచన చేస్తాను .. అందుకు తగిన విధంగానే సెట్స్ వేయిస్తుంటాను" అని అన్నారు. 

"అవసరం లేకపోయినా నేను సీజీ వాడుతుంటాననీ .. సెట్స్ వేయిస్తుంటాననే అపవాదు నాపై ఉంది. 'ఒక్కడు' సినిమా కోసం 'చార్మినార్' సెట్ వేయించాను. అప్పట్లో పాతబస్తీలోని చార్మినార్ దగ్గర షూటింగులకు అనుమతులు లేవు. ఒకవేళ ఇచ్చినా .. ఆ చుట్టుపక్కల 100 ఇళ్లవాళ్ల అనుమతి కూడా తీసుకోవాలి. అది సాధ్యమయ్యే విషయం కాదు .. అందుకే సెట్ వేయించడం జరిగింది" అని చెప్పారు. 

"నా నుంచి కొన్ని హిట్లు .. కొన్ని ఫ్లాపులు వచ్చి ఉండొచ్చు. నా దగ్గర కథ ఉండాలే గానీ చిరంజీవి గారే అయినా .. మహేశ్ బాబు .. అల్లు అర్జున్ అయినా, నేను ఒక్క కాల్ చేస్తే నాతో చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఒక కథపై నేను ఏ స్థాయిలో ఎఫర్ట్స్ పెడాతానో .. ఎంత కష్టపడతానో వారికి తెలుసు. అందువలన ఈ రోజుకీ వాళ్లంతా నన్ను నమ్ముతారు" అంటూ చెప్పుకొచ్చారు. 


Mahesh Babu
Bhumika
Gunasekhar
Okkadu Movie
  • Loading...

More Telugu News