Venkatesh: వెంకీ భారీ యాక్షన్ మూవీగా 'సైంధవ్' .. రిలీజ్ డేట్ ఇదే!

Saindhav release date confirmed

  • 'సైంధవ్' గా కనిపించనున్న వెంకటేశ్
  • కెరియర్ పరంగా ఇది ఆయనకి  75వ సినిమా 
  • శైలేశ్ కొలను రూపొందిస్తున్న యాక్షన్ సినిమా 
  • కీలకమైన పాత్రను పోషిస్తున్న నవాజుద్దీన్ సిద్ధికీ   
  • ప్రపంచవ్యాప్తంగా ఈ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ 

వెంకటేశ్ క్రితం ఏడాది 'ఎఫ్ 3' సినిమాతో ఆడియన్స్ కి కితకితలు పెట్టేశారు. అలాగే 'ఓరి దేవుడా' సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. ఇక ఈ ఏడాది ఆయన శైలేశ్ కొలను దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ చేస్తున్నారు. కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  

ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు వీడియో చూడగానే, యాక్షన్ ఒక రేంజ్ లోనే ఉంటుందనే విషయం అర్థమైపోయింది. ఆ తరువాత నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఒక్కసారిగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 22న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ ఒక పోస్టర్ ను వదిలారు.

భారీ పేలుడు పదార్థాలకు సంబంధించిన కంటైనర్ పై, తుపాకీ పట్టుకుని కూర్చున్న వెంకీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అప్పటికే ఆయన గాయపడి ఉండటం చూస్తుంటే, ఇంకా ఎవరైనా వస్తే రానీ చూసుకుందాం అన్నట్టుగా ఆయన అక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నాడనే విషయం తెలిసిపోతోంది. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికీ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. 

Venkatesh
Nawajuddin Siddiqui
Saindhav Movie
  • Loading...

More Telugu News